శ్రీ సత్యసాయి జిల్లా:
* కొత్తచెరువు మండలం తలమర్ల _ మీర్జాపురంలో విషాదం నెలకొంది.
* మీర్జాపురం గ్రామానికి చెందిన సాయమ్మ, హనుమంతు దంపతుల కుమారుడు చరణ్(15) బావిలో పడి మరణించినట్లు సమాచారం.
* మీర్జాపురం నుంచి తలమర్ల పాఠశాలకు ఉదయం బయలుదేరిన చరణ్ మార్గమధ్యంలో బహిర్భూమికి వెళ్ళాడు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్ళి దురదృష్టవశాత్తు బావిలో పడి మరణించినట్లు తెలుస్తోంది.
* ఉదయం నుంచి సాయంత్రం వరకు బావిలో మోటార్లతో నీరు కొడుతున్నా ఎక్కువగా ఊరుతుండడంతో రాత్రి 6.30 వరకు కూడా మృతదేహాన్ని బయటకు తీయలేకపోయారు.
* తమ బిడ్డ కోసం తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్థులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సజీవంగా రావాలని కోరుకుంటున్నారు.
* అధికారుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Post Views: 44









