*2025 కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు!
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే గౌరవ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి గడిచిన 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, చేయబోతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేశారు.
అనంతరం కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన శుభాకాంక్షలు తెలిపారు
సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్
తల్లికి వందనం 10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్థులకు సాయం.
స్త్రీ శక్తి ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం… ఇప్పటివరకు 3.25 కోట్ల ప్రయాణాలు. ఇప్పటివరకు ఈ పథకానికి రూపాయలు ఒకటి 1,144 కోట్ల వ్యయం.
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వీరు ఎక్కడైనా పింఛన్ తీసుకునే అవకాశం.
అన్నదాత సుఖీభవ 46లక్షల మంది రైతులకు…. రూ.6, 310 కోట్లు రైతుల ఖాతాలో జమ.
దీపం- 2 ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు, రూ 2,684 కోట్లు, ఇప్పటికి దాదాపు రెండు కోట్ల సిలిండర్ల పంపిణీ.
ఎన్టీఆర్ భరోసా. రూ.50,000 కోట్లకు పైగా పెన్షన్ల వ్యయం…. ఏడాదిలో రూ 33,000 కోట్లు పంపిణీ, నెలకు రూ.2,750 కోట్లు.
ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను గడిచిన 18 నెలల్లో ప్రజలకు అందజేసిందని కందికుంట వెంకటప్రసాద్ తెలియజేశారు.*









