డీజే పాటలకు స్టెప్పులతో అదరగొట్టిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని పెన్నా నది సమీపంలో జాయివర్క్ క్లబ్లో 2026 నూతన సంవత్సరం వేడుకలను ఐదు రోజులపాటు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి కార్యక్రమానికి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి హాజరయ్యారు. అభిమానుల కోరిక మేరకు జేసీ అస్మిత్ రెడ్డి డీజే పాటలకు నృత్యం చేశారు. ఆయన నృత్యం చేయడానికి చూసిన కుర్ర కారు కేరింతల కొడుతూ అడుగులో అడుగు వేయడంతో ఆ ప్రాంతమంతా విజిల్స్ కేకలతో హోరెత్తిపోయింది. ప్రస్తుతం ఎమ్మెల్యే జేసిఎస్మిత్ రెడ్డి డాన్స్ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Post Views: 29









