శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కదిరి పట్టణ సిఐ డివి నారాయణరెడ్డి గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం సుమారు 9:30 గంటలకు కొందరు వ్యక్తులు కోనేరు దగ్గర గంజాయి అమ్ముతున్నారని సమాచారం తెలియగా పోలీసులు రైడ్ చేయగా కొంతమంది నిందితులు పట్టుబడ్డారు. వారిలో బుక్కే అనిల్ నాయక్, దేవరకొండ పవన్ కుమార్, సాకే సూరి అనంతపురం నుండి గంజాయిని తీసుకొచ్చి కదిరి మరియు పరిసర ప్రాంతాలలో పాకెట్ల రూపంలో విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. వీరి వద్ద సుమారు ఒక్కరి దగ్గర 400 గ్రాములు గంజాయి మొత్తం ఒక 1 kg 200 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఈ ముగ్గురు మీద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది.
Post Views: 54









