అట్టహాసంగా 8వ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణ

IFMA ( ఐఎఫ్ఎంఏ) ఛైర్మన్ డాక్టర్ అక్కమ్మగారి సూర్యనారాయణ , CJM infra ప్రాజెక్ట్స్ డైరెక్టర్స్ చేతుల మీదగా పోస్టర్ లాంచ్

ఈరోజు కదిరిలోని CJM infra ప్రాజెక్ట్స్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇండియన్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ ఛైర్మన్ డాక్టర్ శ్రీ అక్కమ్మగారి సూర్యనారాయణ , CJM infra ప్రాజెక్ట్స్ డైరెక్టర్స్ పాల్గొని అలాగే వారి చేతుల మీదగా అనంతపురము ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో జరిగే 8వ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ పోస్టర్లు లాంచ్ చేసారు. కార్యక్రమంలో సూర్యనారాయణ గారు మాట్లాడుతూ ఈ ఫెస్టివల్‌లో భాగంగా జనవరి 27న ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించబడతాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులు, చిత్రకారులు, యువ దర్శకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జనవరి 28న ప్రత్యేక ఆకర్షణగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఈ శిక్షణలో AI టూల్స్ ఉపయోగించి , పాటలు రచించడం, ట్యూన్ కట్టడం, మ్యూజిక్ కంపోజిషన్, పాటలకు సెలెబ్రిటీ-స్టైల్ డాన్స్ వీడియోలు సృష్టించడం వంటి ఆధునిక అంశాలపై ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించనున్నారు. ఈ శిక్షణ యువ చిత్రకారులకు, కంటెంట్ క్రియేటర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. జనవరి 29 మరియు 30 తేదీల్లో దేశవ్యాప్తంగా ఎంపికైన లఘు చిత్రాల ప్రదర్శనలు నిర్వహించబడతాయి. సామాజిక, సాంస్కృతిక, వినోదాత్మక అంశాలతో రూపొందిన నాణ్యమైన చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.
ఫెస్టివల్ చివరి రోజు అయిన జనవరి 31న అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించబడుతుంది. ఉత్తమ లఘు చిత్రాలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేయనున్నారు.
ఈ ఫెస్టివల్ ద్వారా యువ ప్రతిభను ప్రోత్సహించడం, నూతన సాంకేతికతను సినీ రంగంతో అనుసంధానించడం ప్రధాన లక్ష్యమని అనంతపురము ఫిలిం సొసైటీ ప్రతినిధులు తెలిపారు. సినీ అభిమాని ప్రజలు, విద్యార్థులు, యువ చిత్రకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ ఛైర్మన్ డాక్టర్ శ్రీ అక్కమ్మగారి సూర్యనారాయణ గారు , అనంత షార్ట్ ఫిలిమ్స్ సొసైటీ ప్రెసిడెంట్ మరియు ఫిలిం మేకర్ రషీద్ బాషా గారు , CJM infra ప్రాజెక్ట్స్ డైరెక్టర్స్ దారా.చిన్న , దాసరి.జనార్ధన, అత్తార్. ముక్తియార్ బాషా మరియు ఇండియన్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రెటరీ బాదుల్లా , యాక్టర్ పవన్ పాల్గొని పోస్టర్లా చేయడం జరిగింది. అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ కి ప్రదించవలసిన నెంబర్ 9676350681

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు