గాండ్లపెంట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

గాండ్లపెంట మండలం రెక్కమాను గ్రామంలో , 3కోట్ల వ్యయంతో రెక్కమాన్ నుండి వెలిచేమల గ్రామం వరకు పునరుద్ధరణ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం గాండ్లపెంట మండల కేంద్రం నందు 2.7 కోట్ల వ్యయంతో రాజంపేట కదిరి రహదారి యందు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు
అనంతరం
గాండ్లపెంట మండలం కేంద్రం నందు నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభిచిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు మరియు గాండ్లపెంట మండలం నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు