దేశ ప్రతిష్టపై దాడులను సహించం – పత్తికొండ బీజేపీ ఘాటు హెచ్చరిక

పత్తికొండ, ఫిబ్రవరి 22:* పత్తికొండలోని బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది సమావేశానికి స్టేట్ కౌన్సిల్ మెంబర్ పూనా మల్లికార్జున అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది దేశ గౌరవాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టే కార్యక్రమాలపై దాడులు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని భారతీయ జనతా పార్టీ పత్తికొండ మండల అధ్యక్షుడు కరణం నరేష్ తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ
న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న ఇండియా AI ఎక్స్‌పో సందర్భంగా దేశ గౌరవానికి ప్రతీక అయిన భారతమండపం పై కాంగ్రెస్ పార్టీకి చెందిన గుండాలు దాడి చేయడం కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపాన్ని బయటపెట్టిందని ఆయన మండిపడ్డారు. దేశ ప్రతిష్టను పెంచే కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోవడం వారి అసహనం, నిరాశకు నిదర్శనమని విమర్శించారు.
దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెడుతున్న నరేంద్ర మోదీ గారిపై కాంగ్రెస్ నాయకులు కావాలనే నిరసనలు, ఆరోపణలు చేయడం పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమని ఆరోపించారు. దేశ ప్రయోజనాల కంటే రాజకీయ లాభాలే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
భారతదేశం సాంకేతిక రంగంలో ప్రపంచాన్ని నడిపించే స్థాయికి చేరుకుంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా దేశ ప్రతిష్టను దిగజార్చే చర్యలకు పాల్పడడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.
భారతమండపంపై దాడి చేసిన వ్యక్తులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకుని చట్టపరంగా శిక్షించాలని పత్తికొండ బీజేపీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దేశద్రోహ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఘాటుగా హెచ్చరించారు.
ఈ సమావేశంలో పత్తికొండ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గోవర్ధన్ నాయుడు బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు సోమశేఖర్ రెడ్డి బిజెపి సీనియర్ నాయకులు హోసూరు బ్రహ్మయ్య ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
సదా భారతమాత సేవలో
కరణం నరేష్
మండల అధ్యక్షుడు
భారతీయ జనతా పార్టీ
పత్తికొండ

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు