శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు మండలం తలమర్ల గ్రామ సమీపంలోని హంద్రీనీవా కెనాల్ లో రెండు మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. కాలువ వద్ద గొర్రెలు మేపుతున్న కాపర్లు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కాలువ మీదిగా వెళ్లి గుంటిపల్లి వద్ద గ్రామస్థుల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. ఒక వృద్ధుడు, ఒక వృద్ధ మహిళగా గుర్తించారు. భార్యాభర్తలు ఆత్మహత్య పాల్పడినట్లు అందరూ చర్చించుకున్నారు
ఈ ఘటన ఆత్మహత్యా? లేక ఎవరైనా హత్య చేసి కాలువలో పడేశారా? అన్న కోణాల్లో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతులు ఎవరు? ఎక్కడి వారన్న విషయంపై స్పష్టత రాలేదు. కొత్తచెరువు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది. వృద్ధుల మృతదేహాలను చూసి గుంటుపల్లి గ్రామస్తులు కలత చెందారు .








