ఇరాన్ ముస్లిం అత్యున్నత నాయకులు అయతుల్లా ఖమేనీ మరణించిన నేపథ్యంలో, వారి సేవలను స్మరిస్తూ మరియు ప్రస్తుత పరిణామాలపై చర్చించేందుకు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ (UJAC) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేడు మధ్యాహ్నం 12 గంటలకు దాదా గాంధీ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రత్యేక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ ప్రతినిధులు మరియు ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
కావున, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి, వార్తా కవరేజ్ ద్వారా ఈ సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ సి. జాఫర్ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. మీ రాక మాకు ఎంతో బలాన్నిస్తుందని, సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.
Post Views: 5








